నమస్తే శేరిలింగంపల్లి: ఖైరతాబాద్ గణేష్ భారీ విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ సందర్శించారు. పంచముఖ గణేశునికి ప్రత్యేక పూజలు చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రవి కుమార్ యాదవ్ ను ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలోనే ఖైరతాబాద్ అతిపెద్ద వినాయక విగ్రహం, ఎంతో విశిష్టత గలదన్నారు. ప్రజలందరిని సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో చూడాలని వేడుకున్నట్లు రవికుమార్ యాదవ్ తెలిపారు.