నమస్తే శేరిలింగంపల్లి: మూసీ నది వరద భారి నుంచి భాగ్యనగరాన్ని కాపాడిన అపరమేధావి సర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అన్నారు. చందానగర్ లోని సూపర్ విజ్ జూనియర్ కళాశాలలో జాతీయ ఇంజనీర్స్ దినోత్సవాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ సంస్థలలో పనిచేసే ఇంజినీర్స్ ను శాలువ, జ్ఞాపిక, పగడి తో సన్మానించారు. ఈ సందర్భంగా కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ మానవ ప్రగతి ప్రస్థానంలో ఇంజినీరింగ్ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని అన్నారు. ఆయన 30 సంవత్సరాలు ఇంజనీరింగ్ రంగంలో పనిచేసి దేశప్రగతి లో పాలుపంచుకొన్న గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన జన్మదినాన్ని జాతీయ ఇంజినీర్స్ డే గా దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అక్తర్ ఖాన్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రామ్మోహనరావు, ఫణికుమార్, విష్ణుప్రసాద్ , పాలం శ్రీను, జనార్దన్, మల్లేష్, పద్మారావు, బమిడిపాటి వెంకటేశ్వరరావు, ఖాదర్, విజయలక్ష్మి, వాణి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.