వీధి వ్యాపార సముదాయంలో అన్ని వసతులు కల్పించాలి – అధికారులతో ప్రభుత్వ విప్ గాంధీ సమీక్ష

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో ఇటీవల ప్రారంభించుకున్న వీధి వ్యాపారుల సముదాయంలో వ్యాపారులకు అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, అందుకు విధివిధానాలు రూపొందించాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి‌ గాంధీ అధికారులకు సూచించారు. మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో నూతనంగా నిర్మించిన వీధి వ్యాపారుల సముదాయంలో ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతుల‌ కల్పనపై చందానగర్ డీసీ సుధాంష్ , టౌన్ ప్లానింగ్ , ట్రాఫిక్, పారిశుధ్య విభాగం అధికారులతో ప్రభుత్వ విప్ గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి పక్కన చిన్నచిన్న వ్యాపారాలు చేస్తున్న వీధి వ్యాపారస్తులకు చక్కటి వాతావరణం లో వ్యాపారం చేసుకునేందుకు వీలుగా వీధి వ్యాపారుల సముదాయం ను రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒకే చోట అన్ని రకాల వ్యాపారం చేసుకునేందుకు వీలుగా అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మహిళ వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ వత్సల దేవి, ఏఎంహెచ్ఓ కార్తిక్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సంపత్, మియాపూర్ ట్రాఫిక్ సీఐ సుమన్, తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here