నమస్తే శేరిలింగంపల్లి: పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి బాసటగా మారిందని, అత్యవసర వైద్య చికిత్స అవసరం ఆపన్న హస్తంలా నిలుస్తోందని ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురికి అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం కింద ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా ఒకరికి ముందస్తు చికిత్స కోసం రూ. 4 లక్షల ఎల్ ఓ సీ, 35 మంది బాధితులకు రూ. 18.40 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రోజాదేవి రంగరావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తో పాటు మాజీ కార్పొరేటర్ రంగారావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డీవిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్, నాయకులు వాలా హరీష్, నాయి నేని చంద్రకాంత్ రావు, దామోదర్ రెడ్డి, కొండల్ రెడ్డి, కాశినాథ్ యాదవ్, పోతుల రాజేందర్, సైదేశ్వరరావు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.