చందానగర్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం – యూజీడీ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ మంజుల రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలలో మౌలిక వసతులను కల్పించి అభివృద్ధిలో ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. రూ. 4.09 కోట్ల నిధుల అంచనా వ్యయంతో చేపట్టనున్న యూజీడీ పనులకు స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ చందానగర్ ను దశల వారీగా అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలకు ట్రాఫిక్ రహిత, మెరుగైన రవాణా సౌకర్యం కోసం శాయ శక్తుల కృషి చేస్తానని చెప్పారు. అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లక్ష్మీ నారాయణ గౌడ్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు దాసరి గోపి, కరుణాకర్ గౌడ్, వెంకటేష్ ముదిరాజ్, గురు చరణ్ దుబే, ప్రవీణ్, గుడ్ల ధనలక్ష్మి, ప్రీతమ్, ఓ వెంకటేష్, రవీందర్ రెడ్డి, మల్లేష్, గోవర్ధన్, అక్బర్ ఖాన్, పారునంది శ్రీకాంత్, హరీష్, దాస్, యూసఫ్, అంజద్ పాషా, కొండల్ రెడ్డి , బోస్, ప్రవీణ్, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, మహిపాల్, నీలకంఠ రెడ్డి, రాజు, రఘునాథ్ రెడ్డి, రషీద్, నర్మెంద్ర భల్లా తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ లో యూజీడీ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here