నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని కైలాస్ నగర్ కాలనీలో బుధవారం స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు.కాలనీలో నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కాలనీ వాసులతో కార్పొరేటర్ చర్చించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ సహకారంతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, కైలాస్ నగర్ కాలనీ వాసులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






