నమస్తే శేరిలింగంపల్లి: శిష్టకరణ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు పార్లమెంట్ కు ప్రతిపాదనలను పంపించటం జరిగిందని ఎన్ సీ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి తెలిపారు. జాతీయ శిష్టకరణ ఓబీసీ సాధన కమిటీ కన్వీనర్ డీ వీ కృష్ణారావు నాయకత్వంలో జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ సభ్యులు తల్లోజు అచారి ని శుక్రవారం ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తల్లోజు ఆచారి తో ఓబీసీ ఆంశాన్ని సుదీర్ఘంగా చర్చించినట్లు కృష్ణారావు తెలిపారు.ఈ విషయమై ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో శిష్టకరణ ఓబీసీ జాబితాలో చేర్చే అంశంపై పార్లమెంట్ కు ఎన్ సీ బీసీ సిపార్సులను పంపించటం జరిగిందని, ఓబీసీ లో శిష్టకరణాలను చేర్చే ప్రక్రియ తుది దశకు చేరినట్టు ఆయన వెల్లడించారు. ఎన్ సీబీసీ సభ్యులు తల్లోజు ఆచారిని కలిసిన వారిలో జాతీయ శిష్టకరణ ఓబీసీ సాధన కమిటీ కన్వీనర్ డీ వీ కృష్ణారావు తో పాటు తెలంగాణ రాష్ట్ర శిష్టకరణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బి. విజయ్ కుమార్ , కోశాధికారి ఉరిటి పార్వతీశ్వరరావు , అడిషనల్ ప్రధాన కార్యదర్శులు డొంకాడ అనంత ప్రసాద్ , మోటూరి నారాయణ రావు తమిర్సి ప్రతాప్ రాజ్ , పలువురు సంఘ సభ్యులు ఉన్నారు.