నిరుద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి: బిజెవైఎం

నమస్తే శేరిలింగంపల్లి: బీజేవైయం శేరిలింగంపల్లి అసెంబ్లీ ఆధ్వర్యంలో కొండాపూర్ ఆర్టీఏ చౌరస్తా లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నీరంజన్ రెడ్డి దిష్టిబొమ్మను‌‌ శుక్రవారం దహనం చేశారు.రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేవైయం ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగులను అగౌరపరిచేలా, ఉద్యోగ ప్రకటన లేదు, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, సంవత్సరానికి రెండు సార్లు వానకాలం ,యాసంగి సమయంలో నిరుద్యోగులు హమాలి చేసుకోవాలని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను బీజేవైయం తీవ్రంగా ఖండిస్తుందన్నారు.మంత్రి నిరంజన్ రెడ్డిని మంత్రి వర్గం నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇంటికి ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ,నిరుద్యోగులకు ప్రతీ నెల నిరుద్యోగ భృతి ఇస్తామని , ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దె నెక్కిన సీఎం కేసీఆర్, ఈ రోజు మంత్రులతో నిరుద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయించడం దారుణమన్నారు. ఇఛ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో బీజేవైయం ఆధ్వర్యంలో ఉద్యమించి నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేవైయం రాష్ట్ర నాయకులు నిరటి చంద్రమోహన్ ,బీజేవైయం జిల్లా కార్యదర్శి సాయి, బీజేవైయం నాయకులు రాజేందర్ రెడ్డి , కుమార్ సాగర్, బీజేవైయం డివిజన్ అధ్యక్షులు నవీన్ రెడ్డి , సిద్దూ , శివ కుమార్ ,మధుసూదన్ రావు ,బీజేవైయం డివిజన్ నాయకులు మున్నూరు సాయి ,అచ్యుత్ రెడ్డి ,సాయి మురళి ,మన్యం ,సతీష్ గౌడ్ , శ్రీను నాయక్ , రవీంద్ర నాయక్ , సురేష్ ,శివశంకర్ గౌడ్ ,మనోజ్ ,శివాజీ ,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీజేవైఎం నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here