నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సందయ్య నగర్, ఆర్ జీ కే కాలనీలో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సందయ్య నగర్ కాలనీలోని చర్చ్ ఏరియా, మెయిన్ రోడ్డు లో విద్యుత్ స్తంభాలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ను పరిశీలించారు. ఆర్ జీ కే లో వాటర్ ట్యాంక్, తదితర ప్రాంతాలను పరిశీలించారు. కాలనీ లో ఉన్న ప్రజలతో మాట్లాడి త్రాగునీటి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఆర్ జీ కె లో నీటి గుంతలు, చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రజలకు సూచించారు. హనుమాన్ దేవాలయం ముందు ఉన్న వర్షపునీటి గుంత వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా సమస్యను పరిష్కారిస్తానని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈ సునీల్, వార్డు మెంబర్ శ్రీకళ, సందయ్య నగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు బస్వరాజు, సీనియర్ నాయకులు బసవయ్య, పట్లోళ్ల నర్సింహారెడ్డి, నాయకులు ఆర్. జమ్మయ్య, వెంకటేశ్వర్లు, ఎండీ ఆలీమ్, ఏ. రమేష్, శ్రీనివాస్, రామ్మోహన్, పుండరికర్, రాంరెడ్డి, రహమాన్, రాజు, రాజేందర్, హరి, మహేందర్, భాగ్యలక్ష్మి, కుమారి, సుధారాణి, సభియా, నాజియా, కల్యాణి, రోజా, గౌశీయా కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
