శేరిలింగంపల్లి, ఏప్రిల్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): వరంగల్‌లో జరిగిన బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసినందుకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా కార్యకర్తలకు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, సోషల్ మీడియా వారియర్స్ కు, ప్రతి ఒక్కరికి గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో ఇంతే చురుకుగా పాల్గొంటారని ఆశిస్తూ అందరికీ తన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.