శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 1 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీ రాజకీయ యుద్ధ భేరి ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర బీసీల ఐక్యవేదిక, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ జేఏసీ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ మద్దతు పలికారు. కేంద్ర కార్యాలయంలో బీసీ ఉద్యమంలో భాగంగా తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చిన వరంగల్ యుద్ధ భేరికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మల్లన్నకు పూర్తి మద్దతు ప్రకటించారు. 33 జిల్లాల్లో బీసీ ఐక్యవేదిక కార్యవర్గాలు ఉద్యమ రూపంలో పనిచేస్తాయని మల్లన్నకి సందేశం పంపారు. తీన్మార్ మల్లన్న అనుచరుడైన వనపర్తి జిల్లా విజయ్ యాదవ్ ని భేరి రామచంద్ర యాదవ్ వద్దకు పంపగా కార్యవర్గ సమావేశంలో కూడా విజయ్ విజయ్ యాదవ్ యుద్ధ భేరికి మద్దతు తెలియజేయాలని వరంగల్ సమావేశంలో పాల్గొనాలని కోరారు. భేరి రామచంద్ర యాదవ్ కార్యవర్గ సమ్మతంతో 100% తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలియజేశారు. వరంగల్ సమావేశంలో తప్పక పాల్గొని తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం వనపర్తి జిల్లా అధ్యక్షుడు విజయ యాదవ్, కే నరసింహ యాదవ్, శివరాజ్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా మహిళా కన్వీనర్ హిందూమతి, మోహన్ చారి, కృష్ణ ముదిరాజ్, చరణ్, ఎండి కమార్ పాషా, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.