పేద విద్యార్థికి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆర్థిక చేయూత

  • ఇంజినీరింగ్ విద్యనభ్యసించేందుకు కాలేజీ ఫీజు రూ. 1లక్ష 26వేల 500లను చెల్లింపు

నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ కు చెందిన వీరన్న యాదవ్ (లేట్ ) సుభద్ర కుమారుడు సుమంత్ (పేద విద్యార్థి) ఉన్నత చదువులకోసం ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేయూతనందించారు. తన సొంత డబ్బులతో ఈ విద్యా సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు రూ. 1లక్ష 26వేల 500లను చెక్కు రూపేణా చెల్లించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ వీరయ్య యాదవ్ మరణించడంతో మానవతా దృక్పథంతో వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటూ వారి ముగ్గురి పిల్లలను దత్తత తీసుకొని వారి చదువులకు ఆటంకం కల్గకూడదనే ఉద్దేశ్యంతో వారి చిన్నప్పటి నుండి చదివిస్తున్నట్లు తెలిపారు.

సుమంత్ (పేద విద్యార్థి) ఉన్నత చదువులకోసం కాలేజీ ఫీజు రూ. 1లక్ష 26వేల 500లను చెక్కు రూపేణా అందజేస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

వారి పెద్ద కుమార్తె గీత ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని, ఇటీవల సాఫ్ట్ వేర్ గా స్థిరపడిందని, చిన్న కూతురు హర్షిత భద్రుక కళాశాలలో పీజీ చదువుతుందని, వారి కుమారుడు సుమంత్ మల్లారెడ్డి కళాశాలలో నాల్గవ సంవత్సరం చదువుతున్నాడని, ఇంజనీరింగ్ విద్యానభ్యసించడానికి కాలేజీ ఫీజుల నిమ్మితం ఈ విద్య సంవత్సరానికి నగదు చెల్లించాననన్నారు. కాలేజీ ఫీజు కోసం ఆర్థిక సహాయాన్ని అందించిన ఎమ్మెల్యే గాంధీకి విద్యార్థి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here