నమస్తే శేరిలింగంపల్లి: చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు మద్దతుగా గోపన్ పల్లి, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్ కాలనీలలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని, కాసానిని అఖండ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇద్దామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.