హాఫీజ్ పేట్ (నమస్తే శేరిలింగంపల్లి): డివిజన్ పరిధిలోని కాయిదమ్మ కుంట చెరువు సుందరీకరణ పనులను స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కాయిదమ్మ కుంట చెరువు కు మహర్దశ కలుగనుందని, చెరువులోని గుర్రపు డెక్కను పూర్తి స్థాయిలో తొలగించి ఆహ్లదకరమైన వాతవరణం కలిపిస్తామని అన్నారు. స్థానికులు దోమలు, మురుగువాసన సమస్యలను తమ దృష్టికి తీసుకురాగా వారి కోరిక మేరకు సుందరికరణ పనులు చేపట్టడం జరిగినది తెలిపారు. వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని పనులలో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేస్తామని, చెరువు చుట్టు వాకింగ్ ట్రాక్, పూడికతీత పనులు పూర్తి చేసి ఎటువంటి సమస్యలు లేకుండా చూసి స్థానిక ప్రజలకు చక్కటి ఆహ్లదకరమైన వాతావరణాన్ని అందిస్తామని పేర్కొన్నారు. చెరువులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చెరువులను కబ్జాలకు గురికాకుండా చూసెందుకు అందరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఈఈ చిన్నా రెడ్డి, డీఈలు సురేష్ కుమార్ రూప దేవి, వర్క్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్, మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, తెరాస నాయకులు వాలా హరీష్, లక్ష్మా రెడ్డి, యాదగిరి గౌడ్, వెంకటేష్, సంజు, నరేందర్, శాంతయ్య, ప్రవీణ్, సబీర్, తాహిర్, పాషా ముకేశ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.