ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో వెంకట పాపయ్య నగర్ కాలనీలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ 9వ రోజు బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కాలనీలో ఉన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు మొదలైన పనులను 95 శాతం వరకు పూర్తి చేశామని మిగతా పనులను కూడా త్వరగా పూర్తి చేస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు రామకృష్ణ గౌడ్, డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, వార్డు సభ్యుడు కాశీనాథ్ యాదవ్, నాయకుడు బోయ కిషన్, వెంకట పాపయ్యనగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, నారాయణ, మల్లారెడ్డి, జనార్దన్ రావు, జనార్దన్ రెడ్డి, దేవేందర్, సత్యం, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.