-గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా రూ.20.50 లక్షలతో ఉచిత అంబులెన్స్ సేవలు
-అంబులెన్స్ ను ప్రారంభించి శేరిలింగంపల్లి ప్రజలకు అంకితమిచ్చిన మంత్రి కేటీఆర్
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి) మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా కరోనా వ్యాధిగ్రస్తుల సహాయార్థం ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ తన స్వంత నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి రూ. 20.50 లక్షలతో ప్రత్యేక అంబులెన్స్ తయారు చేయించారు. కాగా శనివారం ప్రగతి భవన్ లో మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కులతో మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించి నియోజకవర్గ ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ గారు మాట్లాడుతూ కరోనా వ్యాధి విస్తరణ నేపథ్యంలో గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో నియోజకవర్గ ప్రజలకు చేయూతనివ్వడానికి అంబులెన్స్ ను అందిచడం జరిగినది అని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎల్లా వేళల అందుబాటులో ఉండి అన్ని రకాల విధంగా తోడ్పాటు అందిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు .