పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ కవర్లు వాడకం తగ్గించాలి : చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలన్నా.. ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉండాలన్నా.. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీనీ గెలిపించాలని చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి,  శేరిలింగంపల్లి బీజేపీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు.

మై హోం మంగళ రోడ్ లో కూరగాయల మార్కెట్ లో జ్యూట్ బ్యాగు పంపిణీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవికుమార్ యాదవ్

కొండాపూర్ లోని మై హోం మంగళ రోడ్ లో వీధి వ్యాపారులు నిర్వహించే కూరగాయల మార్కెట్ లో ప్రకృతిని సంరక్షించుకోవాలనే సదుద్దేశంతో జ్యూట్ బ్యాగ్ లను లింగంపల్లి కంటేస్టేట్ కార్పొరేటర్ ఎల్లేష్, డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులు, శ్రీధర్, సీనియర్ నాయకులు రమేష్, శ్రీశైలం, వర ప్రసాద్, శ్రీను, రవి గౌడ్ , రాజు , రవి నాయక్ , నరసింహ, బాబు, కుమార్ యాదవ్, అరుణ్ , రాజేష్ , సాగర్ , శ్రీకాంత్ మరియు బీజేపీ శ్రేణులతో కలిసి  పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందనీ , ప్లాస్టిక్ బ్యాగ్ లను వాడటం తగ్గించి జ్యూట్ బ్యాగ్ లు , కాటన్ బ్యాగ్ లను వాడాలని సూచించారు.

జ్యూట్ బ్యాగులతో…

దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, వివిధ మోర్చల నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here