నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి జగదీశ్వర్ గౌడ్ జలమండలి మాదాపూర్ డిజీఎం శ్రీమన్నారాయణతో గురువారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. మాదాపూర్ డివిజన్ పరిధిలో పెండింగులో ఉన్న పైప్ లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని, ఆదిత్య నగర్ లో ప్రతి ఇంటికి నూతన నల్లా కనెక్షన్లు అందించాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, పెండింగులో ఉన్న ఇతర మౌళికవసతుల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించారు. కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన డీజిల్ ప్రాధాన్యత క్రమంలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిత్యనగర్ టిఆర్ఎస్ అధ్యక్షులు ఎండి.ఖాసీం, వార్డ్ సభ్యులు రహీం, నాయకులు లియాకత్, బాబూమియా, షోయబ్, షైక్ చంద్ తదితరులు పాల్గొన్నారు.
