ఐపియల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్..భారీగా నగదు స్వాధీనం

పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, సెల్ ఫోన్లు

క్రైమ్(నమస్తే శేరిలింగంపల్లి): ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై నిఘా ఉంచిన పోలీసులు బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ గ్యాంబ్లర్ తో పాటు ఇద్దరు కలెక్షన్ బాయ్స్ ను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సైబరాబాద్ ఎస్ఓటి అడిషనల్ డిజిపి మీడియాకు వివరించారు. రామ్ కోఠి ప్రాంతానికి చెందిన ఆటోమొబైల్ వ్యాపారి మహేంద్ర కుమార్ సోని(39) చంద్రపాల్ సింగ్ అనే క్రికెట్ బుకీ వద్ద సబ్ బుకీ గా పని చేస్తూ ఐపీఎల్ లో క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్నాడు. ఇతని వద్ద సిద్ది అంబర్ బజార్ కు చెందిన ప్రైవేటు ఉద్యోగి రాజేష్ మస్నాజి సూర్యవంశీ(23), జూమేరత్ బజార్ కు చెందిన టిఫిన్ సెంటర్ వర్కర్ కుల్దీప్ సింగ్(24) లు బెట్టింగ్ నగదును సేకరించే కలెక్టన్ బాయ్స్ గా పని చేస్తున్నారు.

పోలీసుల అదుపులో నిందితులు

కాగా శంషాబాద్ ఎస్ఓటి విభాగం ఐపీఎల్ నేపథ్యంలో గత కొంత కాలంగా బెట్టింగులు నిర్వహించే ముఠాలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే ఈ నెల 2వ తేదీన అందిన విశ్వసనీయ సమాచారంతో నిఘా ఉంచిన పోలీసులు ఉప్పర్ పల్లి బ్రాండ్ ఫ్యాక్టరీ వద్ద మహేంద్ర కుమార్, రాజేష్, కుల్దీప్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 5,60,000 రూపాయలతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా ప్రధాన బుకీ చంద్రపాల్ సింగ్ తో పాటు కేసుతో సంబంధం ఉన్న అమిత్, నరేష్ సింగ్ లు పరారీలో ఉండగా వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here