సుదర్శన్ నగర్, గుల్ మోహర్ ఫీడర్ల పరిధిలో మంగళవారం పవర్ కట్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి, గచ్చిబౌలి డివిజన్ల పరిధిలోని ఆయా కాలనీలలో ఈ నెల 15వ తేదీ మంగళలారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం వాటిల్లను‌న్నట్లు గచ్చిబౌలి సబ్ డివిజన్ ఏడీఈ ఆపరేషన్ సతీష్ రెడ్డి తెలిపారు. సుదర్శన్ నగర్ ఫీడర్ 11 కెవి పరిధిలోని సుదర్శన్ నగర్ కాలనీ, ఆలిండ్ ఎంప్లాయిస్ కాలనీ, భాగ్యలక్మి కాలనీ ఏరియా లలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, గుల్ మోహర్ ఫీడర్ 11 కెవి పరిధిలోని గుల్ మోహర్ కాలనీ, డాక్టర్స్ కాలనీ ఏరియా ప్రాంతాలకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి సహకరించగలరని విజ్ఞప్తి చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here