కొండంత అండ గులాబీ జెండా – ఆదిత్య నగర్ లో టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: గులాబీ జెండానే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొండంత అండ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఆదిత్య నగర్ లో పార్టీ నాయకులు, కార్యకర్తల సౌకర్యార్ధం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సాంబశివరావు, నాయకులు ఏకే బాలరాజు, ఆదిత్య నగర్ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షులు మునఫ్ ఖాన్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ మైనారిటీ అధ్యక్షులు రహీం, సుభాష్ చంద్రబోస్ నగర్ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షులు ముక్తర్, యూత్ అధ్యక్షులు ఖాజా, ఆదిత్య నగర్ ఎస్సీ సెల్ అధ్యక్షులు విల్సన్, మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు షైక్ ఖాజా, మైనారిటీ నాయకులు బాబూమియా, సలీం, సాజిద్, జఫ్ఫార్, అంకారావు, అజీమ్, బాబు సహబ్, యూత్ నాయకులు ఇమ్రాన్, మహమ్మద్, బాస్రాత్, రాయీస్, ఇక్బాల్, వాహిద్ తదితరులు పాల్గొన్నారు.

ఆదిత్య నగర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here