ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయ‌డంలో మ‌గ‌వాళ్ల‌ను మించిపోయిన యువ‌తి… ఒకే వాహ‌నానికి 22 చ‌లాన్లు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: అన్ని రంగాల్లో పురుషుల‌తో పాటు స‌మానంగా రాణిస్తున్నారు మ‌హిళ‌లు. హైద‌రాబాద్ నిజాంపేట‌కు చెందిన యువతి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయ‌డంలో మ‌గ‌వారికి తానేం తీసిపోన‌ని నిరూపించింది. ఏకంగా ఆమె న‌డిపిన ద్విచ‌క్ర వాహ‌నంపై ఆయా సంద‌ర్భాల్లో 22 చ‌లాన్లు న‌మోద‌య్యాయి. సెల్‌ఫోన్ డ్రైవింగ్‌, హెల్మెట్ లేకుండా వాహ‌నం న‌డపడంపై 22 చ‌లాన్లతో 9070 రూపాయ‌ల జ‌రిమానా విధించారు పోలీసులు. అయిన‌ప్ప‌టికీ జ‌రిమానా చెల్లించ‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్న యువ‌తిని కూక‌ట్‌పల్లి పోలీసులు ఎట్ట‌కేల‌కు పట్టుకున్నారు. స‌ద‌రు యువ‌తికి త‌ల్లిదండ్రుల స‌మ‌క్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి జ‌రిమానా క‌ట్టించుకుని పంపించేశారు. యువ‌తీ యువ‌కులు ప్ర‌మాదాల బారిన ప‌డి న‌ష్ట‌పోక‌ముందే రోడ్డు భ‌ద్ర‌త‌పై దృష్టిసారించాల‌ని పోలీసులు సూచిస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here