నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మంజీర డైమండ్ టవర్స్ వాసులు సిటిజన్స్ హాస్పిటల్ సిబ్బంది పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ను గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బుధవారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ అపార్ట్‌మెంట్ వాసులు స్వచ్ఛందంగా వ్యాక్సినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసుకోవడం అభినదించదగ్గ విషయమని అన్నారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలు నివసించే అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ లలో ఇలాంటి ప్రత్యేక వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు వేసుకోవడం వల్ల త్వరితగతిన వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంజీర డైమండ్ టవర్స్ లో నెలకొన్న సమస్యలను స్తానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, మాజీ అధ్యక్షులు రమేష్ సోమిశెట్టి, మంజీర డైమండ్ టవర్స్ ప్రెసిడెంట్ శ్రీజిత్ నైర్, వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్, సెక్రటరీ అతుల్ సింగ్, జాయింట్ సెక్రటరీ సిద్ధార్థ్ రమబద్రి, కామేశ్వర రావు, సీనియర్ నాయకులు మన్నే రమేష్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
