- హఫీజ్ పేట్ హనుమాన్ యూత్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం
నమస్తే శేరిలింగంపల్లి: హనుమాన్ యూత్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. హనుమాన్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కనకమామిడి నరేందర్ గౌడ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతేకాక హఫీజ్ పేట్ గ్రామ పెద్దలు, యువకులు గ్రామస్తులందరి సమక్షంలో నూతన కార్యవర్గం సభ్యులను ఎన్నుకున్నారు.
ఈ సందర్బంగా నరేందర్ గౌడ్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి తనపై నమ్మకం ఉంచి అధ్యక్షునిగా ఎన్నుకున్న హఫీజ్ పేట్ గ్రామ పెద్దలు, యువకులు గ్రామ ప్రజలందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ శ్రేయస్సు కోసం గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తామని హామీ ఇచ్చారు.