- బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెండో సమావేశంలో వక్తలు
నమస్తే శేరిలింగంపల్లి: బీసీలు ఐక్యంగా పోరాడితే రాజ్యాధికారం వస్తుందని ఒంగోలు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఐక్య వేదిక చైర్మన్ భేరీ రామచందర్ యాదవ్ సమక్షంలో జరిగిన రెండో సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో బండారి రమేష్ యాదవ్ శేరిలింగంపల్లి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కూడా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీలకు జరుగుతున్న చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేయాలన్నారు.
బీసీ ఫెడరేషన్ నాయకులు సాయన్న బీసీలు రాజకీయంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వాలు బీసీలకు దామాషా పద్ధతిలో సీట్లు కేటాయించాలని అన్నారు. విద్య వైద్య సామాజిక ఆర్థిక రంగాలలో వాటా కల్పించాలని అన్నారు. బీసీలంతా ఐక్యమై హక్కుల సాధనకు పోరాడాలన్నారు. ఈ సమావేశంలో నర్సింగ్ ముదిరాజ్, శేరిలింగంపల్లి ఉపాధ్యక్షుడు, మహిళా అధ్యక్షురాలు సరోజమ్మ, ప్రమీలమ్మ, విఘ్నేశ్వర రజక సంఘం నాయకులు కే ఎన్ స్వామి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, చేవెళ్ల నియోజకవర్గ ఇంచార్జి బీసీ నందకుమార్ యాదవ్, కొండాపూర్ ముద్ర సంగం అధ్యక్షులు నీలం లక్ష్మీనారాయణ ముదిరాజ్, ముదిరాజ్ సంఘం యాదవ్ సంఘం, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.