హఫీజ్‌పేట్‌లో పోలీసులపై స్థానిక యువకుల దాడి..? వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత..?

  • వీడియోపై ట్విట్ట‌ర్‌లో క్లారిటీ ఇచ్చిన సైబ‌రాబాద్ క‌మీష‌న‌ర్ స‌జ్జ‌నార్‌

లంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతున్న తరుణంలో ఓ పోలీసు అధికారిపై రాత్రి వేళ‌ కొందరు యువకులు దాడి చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. 30 సెకన్ల నిడివి గల ఈ వీడియో లో కొందరు యువకులు హిందీ భాషలో మాట్లాడుతూ ఓ పోలీసు అధికారిపై విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్‌లో ఈ నెల 28 వ తేదీన రాత్రి 10:00 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పలువురు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై నిజానిజాలను తెలుసుకునేందుకు “నమస్తే శేరిలింగంపల్లి” మియాపూర్ ఇన్‌స్పెక్ట‌ర్‌ వెంకటేష్ సామలను సంప్రదించగా తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటువంటి ఘటన ఏది జరగలేదని స్పష్టం చేశారు. ఎక్కడో జరిగిన సంఘటనను హఫీజ్‌పేట్‌లో జరిగినట్లు ప్రచారం చేస్తున్న విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వారితో పాటు వీడియో ను షేర్ చేసిన వారిపై సైతం చర్యలు తీసుకోనున్నట్లు ఆయన అన్నారు. ఈ విష‌య‌మై హ‌ఫీజ్‌పేట ప్రాంతానికి చెందిన ప‌లువురు స్థానికులు స్పందిస్తూ త‌మ ప్రాంతంలో పోలీసులు ఎవ్వ‌రిపై దాడి జ‌ర‌గ‌లేద‌ని అన్నారు.

క్లారిటీ ఇచ్చిన క‌మీష‌న‌ర్ స‌జ్జ‌నార్‌…
సామాజిక మాధ్య‌మాల‌లో వైర‌ల్‌గా మారిన పోలీసుల‌పై దాడి వీడియోపై సైబ‌రాబాద్ క‌మీష‌న‌ర్ స‌జ్జ‌నార్ క్లారిటీ ఇచ్చారు. స‌ద‌రు ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగింద‌నే విష‌యంపై స్ప‌ష్ట‌త లేద‌ని, క‌మీష‌న‌రేట్ ప‌రిధిలో ఇటువంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోలేద‌ని సైబ‌రాబాద్ పోలీస్‌ ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌ప్పుడు స‌మాచారాన్ని ప్ర‌చారం చేసిన వ్య‌క్తుల‌పై చట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here