మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): కళాశాలలో చదివే విద్యార్థినిని ఇంటికి పిలిపించి లైంగిక వేధింపులకు గురి చేసిన కళాశాల వైస్ ప్రిన్సిపాల్, లెక్చరర్‌లను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నారాయణగూడలో గల సన్ ఇంటర్నేషనల్ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న కళ్యాణ్ వర్మ, లెక్చరర్‌గా పనిచేస్తున్న రవీంద్రలు తమ కళాశాలలో చదువుకుంటున్న ఓ యువతిని గత నెల 24వ తేదీన మాదాపూర్ చందానాయక్ తాండాలోని కళ్యాణ్ వర్మ ఇంటికి పిలిపించారు. కళ్యాణ్ వర్మ తన తమ్ముడిని బయటకు పంపి రవీంద్రతో కలిసి సదరు యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితురాలు ఈ నెల 9వ తేదీన మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నిందితులిద్దిరీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై 354-A, 354-B, 342, 506 r/w 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాదితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
