క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ సంక్షేమ ప‌థ‌కాల‌ను ఆపేది లేదు: ప్ర‌భుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ఓ వైపు క‌రోనా కార‌ణంగా ఆర్థిక సంక్షోభం ఎదుర‌వుతున్న స‌మ‌యంలోనూ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తున్న ఘ‌న‌త టిఆర్ఎస్ ప్ర‌భుత్వానిద‌ని ప్ర‌భుత్వ విప్ గాంధీ అన్నారు. సోమ‌వారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి , షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్దిదారులకు చెక్కుల ను అరికెపుడి గంధీ కార్పొరేటర్లు రోజా దేవి రంగరావు , ఉప్పలపాటి శ్రీకాంత్ ల‌తో కలిసి పంపిణి చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని, సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగరావు వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షలు జిల్లా గణేష్ తెరాస నాయకులు చిన్నోళ్ల శ్రీనివాస్, ఆంజనేయులు శ్రావణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ల‌బ్దిదారుల‌కు చెక్క‌లు అంద‌జేస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here