బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ కు మాతృవియోగం… పరామర్శించిన హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ

నమస్తే శేరిలింగంపల్లి:  బిజెపి రంగారెడ్డి అర్బన్  జిల్లా ప్రధానకార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ మాతృమూర్తి చింతకింది వినోద జగదయ్య గౌడ్ ఆదివారం హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గోవర్ధన్ గౌడ్ కు ఫోన్ చేసి సంతాపం తెలిపారు. గోవర్ధన్ గౌడ్ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని, గోవర్ధన్ గౌడ్ కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

గోవర్ధన్ గౌడ్ మాతృమూర్తి భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్న బీజేపీ నాయకులు

సోమవారం వారి నివాసం వద్ద జరిగిన అంత్యక్రియల్లో బిజెపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్, రాష్ట్ర నాయకులు నందకుమార్ యాదవ్, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, రవి కుమార్ యాదవ్ లతో పాటు జిల్లా నాయకులు, కార్యకర్తలు వినోద జగదయ్య గౌడ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో నాయకులు రవీంద్ర ప్రసాద్ దూబే, జిల్లా ప్రధాన కార్యదర్శి వై శ్రీధర్, ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి, డి ఎస్ ఆర్ కె ప్రసాద్, కార్యదర్శులు మూల అనిల్ గౌడ్, కొమురయ్య, బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్, కాంటెస్టెడ్ కార్పొరేటర్లు కర్చర్ల ఎల్లేష్, సింధు రఘునాథ్ రెడ్డి, విద్యకల్పన ఏకాంత్ గౌడ్, ముఖ్య నాయకులు మహిపాల్ రెడ్డి, నారాయణ రెడ్డి, శాంతి భూషణ్ రెడ్డి, త్రినాథ్ గౌడ్, నీరటిచంద్రమోహన్, చంద్రమౌళి, డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, రాజు శెట్టి, మాణిక్ రావు, ఆంజనేయులు, నాయకులు చిట్టారెడ్డి ప్రసాద్, ప్రశాంత్ చారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here