నమస్తే శేరిలింగంపల్లి : గోపినగర్ చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క ను త్వరితగతిన తొలగించాలని ఎంటమాలజీ శాఖ అధికారులకు శేరిలింగంపల్లి కార్పొరేటర్, స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ రాగం నాగేందర్ యాదవ్ ఆదేశించారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని గోపినగర్ చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడారు. గోపి చెరువులో గుర్రపు డెక్క పెరగడం వల్ల దోమలు విపరీతంగా వృద్ధి చెందే అవకాశం ఉందని, దోమల నివారణకు ఒకవైపు చర్యలు తీసుకుంటూనే.. గుర్రపు డెక్క పనులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
దోమలు ఉత్పత్తి కాకుండా ఉండేందుకు లార్వా దశలోనే నిర్మూలించేందుకు చెరువులో స్ప్రే చేయిస్తున్నామని అన్నారు. చెరువులో మురుగునీరు చేరడం వల్ల గుర్రపు డెక్క పెరుగుతుందని, ఈ చెరువులోకి మురుగునీరు చేరకుండా తూము నుండి వెళ్లే మార్గాన్ని పరిశీలించి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు డిఈ నళిని, నాగేందర్, స్థానిక వాసులు యాదా గౌడ్, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, సందయ్య నగర్ కాలనీ అధ్యక్షులు బస్వరాజ్, ఆరంభ టౌన్షిప్ ప్రెసిడెంట్ రవీంద్ర రాథోడ్, కుటుంబరావు, నర్సింహ, దినేష్, తుకారాం, పాల్గొన్నారు.