నమస్తే శేరిలింగంపల్లి: దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలసి కొండాపూర్ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ (బంజారా నగర్) లోని క్యూ మార్ట్ దగ్గర రూ. 49.50 లక్షల అంచనా వ్యయంతో వరద నీటి కాలువ పనులకు, మార్తాండ్ నగర్ సాహితి స్కూల్ దగ్గర రూ. 48.00 లక్షల అంచనా వ్యయంతో అంతర్గత రోడ్లు పనులకు, మాదాపూర్ లోని నెక్టర్ గార్డెన్స్ గేట్ దగ్గర, రూ. 50.00 లక్షల అంచనా వ్యయంతో వరద నీటి కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక వసతులు, సంక్షేమ పధకాలు, అభివృద్ధి పనులు చేబడుతూ, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని అన్నారు.
ప్రతి బస్తీ, కాలనీలల అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తూ, ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తూ, ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాలు అందేలా చేస్తున్నామని అన్నారు. అభివృద్ధి పనులను శరవేగంగా చేయించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పనులు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, వైస్ ప్రెసిడెంట్ గఫూర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఊట్ల కృష్ణ, షేక్ చాంద్ పాషా, నరసింహ సాగర్, రాజు యాదవ్, శ్రవణ్ యాదవ్, శ్రీనివాస్ చౌదరి, తాడెం మహేందర్, రవి శంకర్ నాయక్, అఫ్రోజ్, అబ్దుల్ కరీం,లక్ష్మి, న్యూ పీజేఆర్ నగర్ ప్రెసిడెంట్ వెంకటి, మొహ్మద్ అలీ, అక్షయ్ అభి, సిద్దిఖ్ నగర్ ప్రెసిడెంట్ బసవరాజు, సయ్యద్ ఉస్మాన్, షేక్ జలీల్ ఖాన్, సాగర్ చౌదరి, రామకృష్ణ, హినాయత్, తిరుపతి మంగళరపు, రజనీకాంత్, హామీద అప్సర, సర్తాజ్, నదీమ్, నసీరుద్దీన్, నరేష్ ముదిరాజ్, వసీమ్, హిమామ్, సంజీవ, జహంగీర్, రమేష్, సాయిబాబా, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.