నమస్తే శేరిలింగంపల్లి: గోకుల్ యూత్ అసోసియేషన్ గోకుల్ శ్రీధర్ యాదవ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
అనంతరం భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ గోకుల్ శ్రీధర్ యాదవ్ స్వామి వివేకానంద బాటలో పయనిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రంతో ఏర్పాటు చేసిన క్యాలెండర్ ను ఆవిష్కరిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. వివేకానంద స్వామి సూక్తితో క్యాలెండర్ ఆరంభం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గోకుల్ శ్రీధర్ యాదవ్, వెంకట్ రాజు యాదవ్ పాల్గొన్నారు.