- శేరిలింగంపల్లి టిఆర్ఎస్ అభ్యర్థులు దాదాపుగా ఖరారు…
- మియాపూర్, హైదర్ నగర్ డివిజన్లలో కొత్తవారికి ఛాన్స్..?
శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): జిహెచ్ఎంసి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి మంగళవారం ఉదయం 11 గం౹౹లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే అధికార టిఆర్ఎస్ పార్టీ 150 డివిజన్లలో అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో గల పది డివిజన్లలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ నెలకొంది. సిట్టింగులకే టికెట్లు అని ప్రచారం జరిగినా మరోవైపు అధికార పార్టీలో ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పలు డివిజన్లలో అధికార కార్పొరేటర్లు సైతం తమకు మరోసారి అవకాశం దక్కుతుందో లేదో అనే సందిగ్ధంలో పడిపోయారు.
అయితే శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని 10 డివిజన్లలో ఎనిమిది మంది సిట్టింగులకు అధిష్టానం మరోసారి అవకాశం ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. శేరిలింగంపల్లి డివిజన్ నుండి రాగం నాగేందర్ యాదవ్, గచ్చిబౌలి నుండి కొమిరిశెట్టి సాయిబాబ, కొండాపూర్ నుండి హమీద్ పటేల్, చందానగర్ నుండి బొబ్బ నవతరెడ్డి, హఫీజ్ పేట నుండి పూజిత జగదీశ్వర్ గౌడ్, మాదాపూర్ నుండి జగదీశ్వర్ గౌడ్, ఆల్విన్ కాలనీ నుండి దొడ్ల వెంకటేష్ గౌడ్, వివేకానంద నగర్ నుండి ఎం. లక్ష్మీబాయి లకే మరోసారి అవకాశం ఇచ్చినట్లు సమాచారం.
కాగా మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ మేకరమేష్ మృతి చెందడంతో ప్రస్తుతం ఆ స్థానం ఖాళీగా ఉంది. ఇక్కడి నుండి ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ ముఖ్య అనుచరుడు ఉప్పలపాటి శ్రీకాంత్ కు దాదాపుగా టికెట్ ఖరారైంది. దీంతోపాటు హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ జానకీ రామరాజు స్థానంలో నార్నే శ్రీనివాస్ ను అభ్యర్థిగా ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇక అభ్యర్థుల జాబితాను టిఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది.
Freelancer గా మీ వెబ్ సైట్ లో అవకాశం ఉందా.. sir
Send your details to 8500639797