- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): బంగారు తెలంగాణ సాధించేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో కలసి పనిచేసేందుకు అందరూ తరలి రావాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. ఆల్విన్ కాలనీ డివిజన్ షంషీగూడ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెరాస నాయకుడు జోగిపేట బాలరాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గాంధీ తెరాస పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్చందంగా తెరాస పార్టీలో చేరుతున్నారని అన్నారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, ఆసరా పింఛన్లు, ఒంటరి మహిళా పింఛన్లు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. తెరాస పార్టీలోకి చేరిన వారిలో నాయకులు సురేష్, ప్రభాకర్, అశోక్, సిద్దు, గణేష్, శ్రీధర్, మహేష్, భరత్, వినోద్, యూసుఫ్ బాబా ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకుడు లక్ష్మణ్ పాల్గొన్నారు.
