చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. గాంధీ 59వ జన్మదినాన్ని పురస్కరించుకొని 59 కిలోల భారీ కేకును కట్ చేయించారు. గాంధీకి వినాయక ప్రతిమను అందజేసిన విజయ్ కుమార్ ఆయన పేరిట 500 మందికి గోడ గడియారాలు అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సంతోషమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్న గాంధీని యువ నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ ప్రతినిధులు గాలి కృష్ణ, రెడ్డి ప్రవీణ్ రెడ్డి, సంతోష్ కుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.