చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గాంధీకి మనకోసం మనం సేవా సంస్థ వ్యవస్థాపకులు బ్రాహ్మణపల్లి కిషోర్ కుమార్, టీఆర్ఎస్ యువ నాయకుడు నిమ్మల దాత్రినాథ్ గౌడ్ లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారి నివాసంలో గాంధీని సత్కరించి, కేక్ కట్ చేయించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గాంధీ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పుట్టా వినయ్ కుమార్ గౌడ్, టిఆర్ఎస్ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుంట్ల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.