గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): రాష్త్ర ప్రజలకు సంక్షేమం తో కూడిన అభివృద్ధిని అందించిన కాంగ్రెస్ పార్టీ పాలనకు ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆ పార్టీ డివిజన్ అభ్యర్థి అరకల భరత్ కుమార్ అన్నారు. గురువారం జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్ పరిధి లోని గౌలిదొడ్డి లో భరత్ కుమార్, పూర్ణిమ భరత్ కుమార్ లు పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పేద ప్రజలందరికీ రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ పథకం, వితంతు, వికలాంగ, వృద్ధాప్య పెన్షన్లు అమలు జరిగాయన్నారు. నగరంలోని అన్ని బస్తీలలో సిసిరోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సదుపాయం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని, డివిజన్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.