ఆర్‌యంపి, పియంపిల‌కు ఉచిత వ్యాక్సినేష‌న్ హ‌ర్ష‌ణీయం: డా.వెంక‌ట్‌రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవ‌లు అందిస్తున్న ఆర్‌యంపి, పియంపి వైద్యుల‌కు ప్ర‌త్యేక క‌రోనా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌ని టిఆర్‌పియ‌స్ రాష్ట్ర అధ్య‌క్షులు డా.వెంక‌ట్‌రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్ట‌ర్ స్వ‌రాజ్య ల‌క్ష్మితో టిఆర్‌పిఎస్ స‌భ్యులు స‌మావేశ‌మ‌య్యారు. గ‌త నెల‌లో సంస్థ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వానికి చేసిన విజ్ఞ‌ప్తి మేర‌కు ఆర్‌యంపి, పియంపి, సిపి, ఇపి వైద్యుల‌కు ఉచితంగా వ్యాక్సినేష‌న్ అందించేందుకు నిర్ణ‌యించ‌డం సంతోష‌క‌ర‌మైన విష‌య‌మ‌ని తెలిపారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ అన్ని జిల్లాల్లో త్వ‌ర‌లోనే ప్రారంభ‌మ‌వ‌నున్న‌ట్లు వెంక‌ట్‌రెడ్డి తెలిపారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌కు అంగీక‌రించిన ముఖ్య‌మంత్రి కెసిఆర్‌, మంత్రులు కెటిఆర్‌, శ్రీ‌నివాస్‌గౌడ్‌, వైద్యాధికారి స్వ‌రాజ్య‌లక్ష్మికి టిఆర్పిఎస్ నాయ‌కులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో స‌భ్యులు జాఫర్, రమేష్ నాయక్, శివశంకర్, యాదయ్య, అంజయ్య, డా. అశోక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

వ్యాక్సినేష‌న్ డ్రైవ్ పై స‌మావేశ‌మైన టిఆర్‌పిఎస్ సంస్థ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here