ఉచిత కంటి పరీక్షల శిబిరానికి అనూహ్య స్పందన

నమస్తే శేరిలింగంపల్లి : మేడ్చల్ మల్కాజ్ గిరి అర్బన్ జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా సెక్రెటరీ అశోక్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని ఆర్ పి కాలనీలో “GY ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసింది.

జి వై ఫౌండేషన్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ప్రజలు

శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి ఇన్ చార్జ్ గజ్జల యోగానంద్ తన వంతు సహకారంగా.. GY ఫౌండేషన్ ద్వారా ఉచితంగా మెడికల్ క్యాంపు, కంటి పరీక్షలు, మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ముఖ్య అతిథులుగా డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్, మేడ్చల్ అర్బన్ జిల్లా మహిళా మోర్చా సెక్రెటరీ విద్యా కల్పన ఏకాంత్ గౌడ్, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు ఏకాంత్ గౌడ్ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు శ్రీహరి యాదవ్, జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యుడు గణేష్ గౌడ్, డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు భీమయ్య గౌడ్, భాను యాదవ్, డివిజన్ సెక్రటరీలు దయాకర్ రెడ్డి, జితేందర్, ఓబీసీ మోర్చా నాయకులు బొట్టు శ్రీను, డివిజన్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు రమేష్ , ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు యాకయ్య, బిజెపి నాయకులు మల్లేష్, సోషల్ మీడియా కన్వీనర్ వినోద్, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సంధ్య, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు ఉపేంద్ర, శాలిని పాల్గొన్నారు.

వైద్య పరీక్షలను పరిశీలిస్తున్న శేరిలింగంపల్లి బిజెపి ఇన్ ఛార్జ్ గజ్జెల యోగానంద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here