కల్వరి హాస్పిటల్ ఆద్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

నమస్తే శేరిలింగంపల్లి: కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బె స్టాస్ కాలనీలో కల్వరి హాస్పిటల్ ఆద్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలతో కూడిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని, ఇక్కడి పరిసర ప్రాంత పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

ఈ శిబిరం ఏర్పాటు చేసిన కల్వరి ఆసుపత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నానని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ఇందులో భాగంగా జనరల్ మెడిసిన్ సంబంధించిన వైద్యులు , స్త్రీల వైద్యులు, చిన్న పిల్లల వైద్యులు, ఎముకలకు సంబంధించిన వైద్యులు, చర్మ వైద్యులు, నేత్ర వైద్యులు పాల్గొని ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందులు కూడా ఉచితంగా అందించడం అభినందనీయమని, ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో 18 రకాల రక్త పరీక్షలు, బీపీ, షుగర్, గైనకాలజీ, ఆర్థో, ఈసీజి, ఈఎంటీ, దంత పరీక్షలు, కంటి పరీక్షలు, ఎక్సరే అర్హులైన వారికి ఉచిత కళ్ళజోడులు, ఉచిత మందులు పంపిణీ వంటి మొదలగు సేవలు ఒకే చోట ఏర్పాటు చేయడం జరిగినదని , పేద ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలు వినియోగించుకోవడం చాలా అభినందనీయమని, ఆరోగ్యం వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో సామాజిక దృక్పథంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించడం అభినందనీయమని వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం చాల గొప్ప విషయమని, పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే గాంధీ కొనియాడారు.

పేద ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం మంచి కార్యక్రమమని పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో ఉచితంగా మందులు పంపిణి చేసి పేదల వద్దకు నాణ్యమైన వైద్యాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యమని , ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ఈ ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.  ప్రతి ఒక్కరు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని, అంతే కాకుండా సీజనల్‌ వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాగేశ్వరరావు, అబుల్, కృష్ణ , ఖయ్యుమ్, రఫిక్, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here