లింగంపల్లిలో బిజెపి సేవా సప్తాహ కార్యక్రమం

బిజెపి కార్యకర్తలకు మందులు పంపిణీ చేస్తున్న డివిజన్ అధ్యక్షుడు రాజుశెట్టి

కార్యకర్తలకు మందులు పంపిణీ చేసిన డివిజన్ అధ్యక్షుడు రాజుశెట్టి

శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సేవా సప్తాహ కార్యక్రమంలో భాగంగా శనివారం శేరిలింగంపల్లి డివిజన్ లింగంపల్లిలో ఉచితంగా ఔషదాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ అధ్యక్షులు రాజు శెట్టి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మువ్వా సత్యనారాయణ సౌజన్యంతో డివిజన్ లోని క్రియాశీలక కార్యకర్తలకు రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్  విటమిన్ సి, డీ ట్యాబ్లెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజుయాదవ్ మాట్లాడుతు ప్రజాసేవలో కీలకంగా పనిచేసే కార్యకర్తలు మొదలు తమ ఆరోగ్యాన్ని జాగ్రాత్తగా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు చిట్టా రెడ్డి ప్రసాద్ , ప్రశాంత్ చారీ, ఉపాధ్యక్షులు శ్రవణ్ పాండే, బాల్ రాజు ,రజని,విరేశం,బాలు, పట్లోళ్ల నర్సింహా రెడ్డి, శ్రీకాంత్, అరుణ, బబులు, ఆనంద్, సబియా, లక్ష్మి,శ్రీలత మరియు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here