- దళితులపై దాడి చేసిన వారిని శిక్షించాలని దళిత సంఘాల డిమాండ్
నమస్తే శేరిలింగంపల్లి: గండిపేట మండలం వట్టీ నాగులపల్లి గ్రామంలో దళితులపై దాడి జరిగినా కేసు నమోదు చేయకపోవడం పట్ల దళిత సంఘాలు ఖండించాయి. వెంటనే దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిఐ ని కోరారు. వివరాలు దళితులు బోనాలు తీస్తామంటేనే మీరు తీయొద్దని కులం పేరుతో దూషించారు. సుమారు 60 మంది అగ్రకులస్తులు ఎనిమిది మందిపై దాడి చేశారు. దీనిపై గచ్చిబౌలి పిఎస్ లో ఫిర్యాదు చేశారు. కానీ రెండు రోజులైన ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడంతో.. దళితులు దళిత సంఘాల సహాయం కోరారు. ఈ వీడియోలు వైరలవ్వటంతో పెద్ద ఎత్తున దళిత సంఘాలు గచ్చిబౌలి సిఐని , దళితులను కలిసి విషయం తెలుసుకున్నారు.
దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి , అరెస్టు చేయాలని సిఐ ని కోరారు. వారిలో ఎస్ సి ఆర్ పి సొసైటీ విజయబాబు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, జాతీయ ఎస్ సి ఆర్ పి సొసైటీ సెక్రటరీ జనరల్ గౌరవ షామ్లెట్ నర్సింగ్ రావు, జాతీయ ఎస్సిఆర్బి సొసైటీ నేషనల్ జాయింట్ సెక్రటరీ భీమ్ ఆర్మీ హనుమంతరావు, జాతీయ ఎస్సీఆర్ కి సొసైటీ యూత్ ప్రెసిడెంట్ షామ్లెట్ సూర్య, భీమ్ ఆర్మీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ రిహాన్ ఖాన్, ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి వాన నరసింహ, బీఎస్పీ సీనియర్ లీడర్ శంషాబాద్, ఎమ్మార్పీఎస్ ప్రేమ్ ఉన్నారు. అనంతరం దళితులను పరామర్శించారు, 24 గంటల్లో నిందితులకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం శిక్ష పడకుంటే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు.