– వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందజేత
– ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 లక్షలు విరాళం

మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లికి చెందిన ప్రముఖ నటుడు, నిర్మాత, నంది అవార్డు గ్రహీత రాంకీ ఆపత్కాలంలో తన ఉదారతను చాటుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీరు ముంచెత్తిన జగద్గిరిగుట్ట ప్రాంతంలోని బాధితులకు నేనున్నానంటు బరోసా కల్పించాడు. వందకు పైగా వరద బాధిత కుటుంబాలకు తన సొంత నిధులతో నిత్యావసర సరుకులను అందజేశాడు. అంతటితో ఆగకుండా రూ.5 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కును మంత్రి కేటీఆర్ కు అందజేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో రాంకీ లాంటి నటులు బాధితులకు ఆసరాగా నిలవడం అభినందనీయమని కేటీఆర్ కొనియాడారు.

