నమస్తే శేరిలింగంపల్లి: గురుపౌర్ణమిని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్, హఫీజ్ పేట్ డివిజన్, ఆల్విన్ కాలనీ డివిజన్ల పరిధిలోని సాయిబాబా ఆలయాల్లో బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ గురువును త్రిమూర్తులతో పోల్చి పూజించే గొప్ప సంప్రదాయం మనదన్నారు. తల్లిదండ్రులతో పాటు గురువులకు సమాజంలో సముచిత స్థానం ఉందన్నారు. అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు మనిషిని నడిపించే శక్తి ఒక్క గురువుకే దక్కిందని తెలిపారు. గురువే ప్రత్యక్ష దైవం అని చెప్పే గొప్ప వేడుక గురుపూర్ణిమ అని అన్నారు. అందరికి గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
