గురువు స్థానం ఎంతో గొప్పది – సాయిబాబా ఆలయాల్లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: భగవంతుని తర్వాత తల్లిదండ్రులను, గురువును దైవ సమానంగా భావిస్తామని, గురువు స్థానం ఎంతో గొప్పదని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని గుల్ మొహర్ పార్కు నేతాజీ నగర్ సాయి బృందావన క్షేత్రంలో శ్రీ శ్రీ పరమాంస పరివ్రాజకాచార్య శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో శ్రీ విఘ్నేశ్వర సహిత దత్తాత్రేయ స్వామి, సాయిబాబా ఆలయంలో రాగం నాగేందర్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అభిషేక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

హుడా ట్రేడ్ సెంటర్ లోని సాయినాథుని ఆలయంలో కాలనీ అసోసియేషన్ సభ్యులతో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

అనంతరం భారతీ నగర్ డివిజన్ పరిధిలోని ఎం ఐ జి కాలనీలోని సాయిబాబా ఆలయంలో నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి తో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. హుడా ట్రేడ్ సెంటర్, రాజీవ్ గృకల్పలోని సాయిబాబా మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ గురు భగవానుడిని స్మరించుకుని గురు పూర్ణిమ రోజున పూజలు చేస్తే సకల సంపదలు లభిస్తాయని అన్నారు. ఉన్నత స్థాయికి ఎదగాలంటే గురుశిక్షణ తప్పనిసరి అని చెప్పారు. ప్రతి ఒక్కరికి తొలి గురువు తల్లి అని, వివేక జ్యోతిని వెలిగించి మంచి జ్ఞానాన్ని అందించగలవారే గురువులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుద్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మహేష్ గౌడ్, బుచ్చిరెడ్డి, వార్డు మెంబర్ శ్రీకళ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్ గృహకల్పలో అన్నదానం చేస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here