నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తండ్రి కీ. శే. రాగం మల్లేశ్ యాదవ్ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ ఆరంబ్ టౌన్ షిప్ ఎస్సీ సెల్ కమిటీ సభ్యులు నివాళి అర్పించారు. టీఆర్ఎస్ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు జనార్థన్ ఆర్ట్ ద్వారా వేసిన రాగం మల్లేశ్ యాదవ్ చిత్రపటాన్ని రాగం నాగేందర్ యాదవ్ కి అందజేశారు. తన తండ్రి చిత్రపటాన్ని ఆర్ట్ ద్వారా చాలా చక్కగా వేసినందుకు జనార్థన్ ను రాగం నాగేందర్ యాదవ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆరంబ్ టౌన్ షిప్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, అడ్వయిజరీ కమిటీ చైర్మన్, గోపి నగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, నరసింహులు యాదవ్, ప్రధాన కార్యదర్శి విక్రమ్ యాదవ్, ట్రెజరర్ నరేంద్ర కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు అరుణ యాదవ్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.