నమస్తే శేరిలింగంపల్లి: పని కోసం ఇంటి నుంచి పదేళ్ల వయస్సు గల కొడుకుతో సహా వెళ్లిన తల్లికొడుకు ఇద్దరూ అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంపంగి రాములు, ఉమ భార్యభర్తలు పాపిరెడ్డి కాలనీ లో నివాసం ఉంటున్నారు. భార్య ఉమ నల్లగండ్ల అపర్ణలో పనిమనిషిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 26 న ఉదయం ఇంటి నుంచి పదేళ్ల వయస్సు గల కొడుకు అరవింద్ ను తీసుకుని ఉమ పనికోసం వెళ్లింది. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో భర్త రాములు అపర్ణలో విచారించగా పనికి వెళ్లలేదని తెలిసింది. భార్య,కొడుకు కోసం చుట్టుపక్కలా, బంధుమిత్రుల వద్ద అడగగా ఎలాంటి ఆచూకీ లభించలేదు. భర్త రాములు ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకున్నారు. ఉమ వయస్సు 32, ఎత్తు 5.2, బ్రౌన్ కలర్, ఇంటి నుంచి వెళ్లినప్పుడు ఆరెంజ్ కలర్ చీర ధరించి ఉందని, అరవింద్ ఎత్తు 3.8, రంగు బ్రౌన్, బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ యూనిఫాం ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిస్తే 86399246927, 9490617118, 8332981141నంబర్లలో సంప్రదించవచ్చని అన్నారు.