నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామం లో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా సారీ మేళా, నవరాత్రి ఉత్సవాలతో పాటు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళా సిబ్బంది బతుకమ్మ లను పేర్చి ఆనందోత్సవాలతో ఆడుకుంటున్నారు. సాయంత్రం కందుల కూచిపూడి నాట్యాలయం రవి శిష్య బృందం దేవి వైభవం పై కూచిపూడి నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. రాక్షసుల మీద దేవతల విజయం, చెడు మీద మంచి గెలుపును సూచిస్తూ మనలోని అరిషడ్వర్గాలను జయించి పరమపద సోపానమైన ముక్తిని ప్రసాదింప చేసుకొనే సాధన మార్గాన్ని నాటక రూపంలో చూపించారు. నవ్య దీపికా, లలితామృత, వైష్ణవి, ముకుంద, వణ్మయి, సహస్ర, శ్రావణి, రితిక, గాయత్రీ , మిత్రవింద తదితరులు ఈ నాట్యాన్ని ప్రదర్శించారు.
