నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా బెంగళూరు కళాకారులు అనురాధ హెగ్డే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని కుమారి సాహిత్య రామ్ కుమార్, కుమారి ఆర్య భరత్, శ్వేతా రఘునాధన్ చేసిన భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. అనురాధ ప్రదర్శనలో భాగంగా శివ స్తుతి, కళింగ నర్తన, దేవర్ణమా, తిల్లాన అంశాలను ప్రదర్శించారు. సాహిత్య రామ్ కుమార్ తన ప్రదర్శన లో భాగంగా చాముండేశ్వరి కృతి, పురందర దశ కీర్తన, రుసిలి రాధా పదం, ద్విజావంతి తిల్లాన, అభంగ్ అంశాలను ప్రదర్శించారు. ఆర్య భరత్, శ్వేతా రఘునందన్ ప్రదర్శనలో భాగంగా తోడయా మంగళం, జనని నిను విన, పెరియ కోవి, కాదనా కుతూహల తిల్లాన అంశాలను ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నారు.