నమస్తే శేరిలింగంపల్లి: వన భోజనాలతో అందరిలో ఐక్యత పెరుగుతుందని, పరిచయాలు మెరుగుపడుతాయని శేరిలింగంపల్లి, మాదాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని పాపిరెడ్డి కాలనీ లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన భోజన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వనభోజనాల్లో మహిళల కోసం నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు కార్పొరేటర్లు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, రాజీవ్ గృహ కల్ప వార్డు మెంబర్ శ్రీ కళ, పాపిరెడ్డి కాలనీ గౌడ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగరాజ్ గౌడ, జనరల్ సెక్రెటరీ వీర వెంకటకళ్యాణ్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ్, సభ్యులు భాస్కర్ గౌడ్, రాజశేఖర్ గౌడ్, సత్తయ్య గౌడ్, వార్డ్ సభ్యులు శ్రీకళ, సుజాత గౌడ్, మహిళా నాయకులు రుక్మిణీ గౌడ్ గౌడ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.